¡Sorpréndeme!

హైచ్చరించిన మైక్ ఇచ్చిన చంద్రబాబు... షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే | Chandra babu naidu giving schock to mla

2017-01-04 2 Dailymotion

హైచ్చరించిన మైక్ ఇచ్చిన చంద్రబాబు... షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల పధకం ప్రారంభ సభలో వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్యను స్వయంగా చంద్రబాబే అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. స్థానిక ఎమ్మెల్యేగా ప్రసంగించేందుకు సిద్ధమైన ఐజయ్యను చంద్రబాబు అడ్డుకున్నారు. మైక్‌ కట్ చేసి వేదికపైనే అందరి ముందే నీవు రాజకీయాలు మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. చివరకు ఆయన మాట్లాడకుండానే ఫిరాయింపు ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌ రెడ్డి పక్కకు తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఐజయ్య మాట్లాడేందుకు సిద్దమవగానే... చంద్రబాబు కొన్ని కండిషన్లు పెట్టి మైక్‌ ఇచ్చారు. నీవు స్థానిక ఎమ్మెల్యేవి. ఈ ప్రాజెక్టులో నీ భాగస్వామ్యం లేదు. అయినా సరే మాట్లాడు. కానీ రాజకీయాలు మాట్లాడవద్దు. కేవలం శుభాకాంక్షలు మాత్రమే చెప్పి వెళ్లు అంటూ ఐజయ్యకు చంద్రబాబు మైక్ ఇచ్చారు. దీంతో మాట్లాడిన ఎమ్మెల్యే ఐజయ్య... పథకాన్ని చంద్రబాబు ప్రారంభించడం ఆనందంగా ఉందని, అయితే ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసింది మాత్రం వైఎస్సే అనగానే చంద్రబాబు అడ్డుకున్నారు. హేం తమ్ముడు విను. నేను చెప్పేది విను. అంటూ మైక్ కట్ చేశారు. ఇంతలోనే భూమా, మోహన్ రెడ్డి వచ్చి ఐజయ్యను పక్కకు తీసుకెళ్లారు.